Hyderabad, ఏప్రిల్ 24 -- తెలుగు టీవీ సీరియల్స్ లో నంబర్ వన్ ర్యాంకు మళ్లీ మారింది. 14వ వారం తొలిసారి కార్తీకదీపం సీరియల్ హవాకు చెక్ పెట్టగా.. ఇప్పుడు 15వ వారం కూడా ఆ సీరియల్ రెండో స్థానానికే పరిమితమైంది. తెలుగులో కొత్తగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అటు అర్బన్, ఇటు రూరల్ ప్రాంతాల్లో కలిపి నంబర్ వన్ గా నిలిచింది.

స్టార్ మాలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గతేడాది నవంబర్ 12న మొదలైంది. వచ్చినప్పటి నుంచీ టాప్ 4లో ఉంటూ వస్తున్న ఈ సీరియల్.. తాజాగా 15వ వారం రేటింగ్స్ లో ఏకంగా నంబర్ వన్ గా నిలిచింది. అర్బన్, రూరల్ కలిపి ఈ సీరియల్ 10.84 రేటింగ్ సాధించింది. ఇక గత వారం టాప్ ర్యాంక్ కోల్పోయిన కార్తీకదీపం 2 సీరియల్.. ఈ వారం 10.68 రేటింగ్ తో మూడో స్థానంలోనే ఉంది.

గత వారం నంబర్ వన్ గా ఉన్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈసారి 10.80 రేటింగ్ తో రెండో స్...