భారతదేశం, ఫిబ్రవరి 5 -- తెలుగులో టాప్ సీరియల్స్ అందించే స్టార్ మా మరో సీరియల్ ను తీసుకొస్తోంది. ఈ సీరియల్ పేరు గోదావరి. తండ్రి లేని కుటుంబానికి ఓ ఆడబిడ్డే ఎలా పెద్ద దిక్కు అయింది అనే ఎమోషనల్ స్టోరీతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. మరి ఆ విశేషాలేంటో చూడండి.

స్టార్ మాలోకి సరికొత్త సీరియల్ త్వరలోనే రాబోతోంది. తాజాగా ఆ ఛానెల్ ఈ సీరియల్ ప్రోమోను రిలీజ్ చేసింది. 3 నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమో మొదట సరదాగా అనిపించినా.. చివరికి ఎమోషనల్ గా ముగిసింది. ఇది తండ్రి లేని నలుగురు కూతుళ్ల చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ఆ కుటుంబానికి జాహ్నవి అనే రెండో కూతురే పెద్ద దిక్కుగా ఉంటుంది. ఈ ప్రోమోలో ఆ తండ్రే తన నలుగురు కూతుళ్లను పరిచయం చేస్తున్నట్లుగా చూపించారు.

మొదట అమెరికా సంబంధం అంటే చాలు పెళ్లికి రెడీ అయిపోయే మొదటి కూతు...