భారతదేశం, ఫిబ్రవరి 6 -- ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోవడం సహజం. అయితే, ఫిడిలిటీ మెగెల్లాన్ ఫండ్‌ను విజయవంతంగా నడిపిన లెజెండరీ ఇన్వెస్టర్ పీటర్ లించ్ గతంలో చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి. మార్కెట్ కరెక్షన్లు లేదా పతనాలు జరిగినప్పుడు ఇన్వెస్టర్లు ఎలా స్పందించాలో ఆయన అప్పట్లోనే చాలా స్పష్టంగా వివరించారు.

మార్కెట్ పతనాలు అనేవి అరుదైన సంఘటనలు కావని, అవి అనివార్యమని పీటర్ లించ్ గుర్తు చేస్తున్నారు. గత 93 ఏళ్ల మార్కెట్ చరిత్రను విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడతాయి.

"ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సింది ఇదే. ఇలాంటి పతనాలను తట్టుకునే మానసిక ధైర్యం లేని వారు ఈక్విటీ మార్కెట్లకు దూరంగా ఉండటమే మంచిది" అని లించ్ కుండబద్దలు కొ...