భారతదేశం, సెప్టెంబర్ 27 -- స్కోడా ఇండియా తమ రాబోయే ఆక్టేవియా ఆర్​ఎస్​ (Skoda Octavia RS) సెడాన్‌ను టీజ్ చేస్తూ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. అయితే ఈ కొత్త ఆక్టేవియా ఆర్​ఎస్​ గురించిన రహస్యం పెద్దగా లేదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో'లోనే దీనిని భారతీయ ప్రేక్షకులకు ప్రదర్శించారు!

ప్రస్తుతానికి, భారతదేశంలో స్కోడా నుంచి లభించే ఫ్లాగ్‌షిప్ సెడాన్ ఆక్టేవియా ఆర్​ఎస్​ కానుంది. దీనిని కంప్లీట్లీ బిల్ట్-అప్ (సీబీయూ) యూనిట్‌గా దిగుమతి చేసుకుని విక్రయించనున్నారు. అంటే ఈ సెడాన్ ధర చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అదే కారణంతో.. ఈ కారు పరిమిత సంఖ్యలోనే అమ్మకాలు జరిపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ టీజర్ వీడియోపై వివిధ వినియోగదారులు పోస్ట్ చేసిన కామెంట్స్ ఆక్టేవియా అభిమానుల్...