Hyderabad, సెప్టెంబర్ 12 -- నటి అనుష్క శెట్టి తాను సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. శుక్రవారం (సెప్టెంబర్ 12) ఎక్స్ లో తన చేతితో రాసిన నోట్‌తో ఈ అనౌన్స్‌మెంట్ చేయడం విశేషం. ఈ మధ్యే వచ్చిన 'ఘాటి' సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అనుష్క ఏం చెప్పిందో చూడండి.

అనుష్క శెట్టి తాను ఒక పేపర్‌పై రాసిన నోట్ నే ట్వీట్ చేసింది. అందులో ఆమె ఏం రాసిందో చూడండి. "స్క్రీన్ ప్రపంచానికి మించి నిజ జీవితానికి, అసలు పనికి తిరిగి కనెక్ట్ అవ్వడానికి" ఒక బ్రేక్ తీసుకుంటున్నట్లు రాసింది. "బ్లూ లైట్‌ను క్యాండిల్ లైట్‌తో మారుస్తున్నాను. (నవ్వుతున్న ఎమోజీ).

నేను సోషల్ మీడియా నుంచి కొంత కాలం దూరంగా ఉంటున్నాను. మనం అందరం నిజంగా ఎక్కడ మొదలుపెట్టామో ఆ ప్రపంచానికి, ఆ పనికి తిరిగి కనెక్ట్ అవ్వడాన...