భారతదేశం, అక్టోబర్ 4 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సోమవారం, అంటే 2025 అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. ఈ పబ్లిక్ ఇష్యూ 2025 అక్టోబర్ 8 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే, టాటా క్యాపిటల్ ఐపీఓలో పెట్టుబడి పెట్టడానికి గడువు అక్టోబర్ 6 నుంచి 8 వరకు ఉంటుంది. మరి ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చా? లేదా?

టాటా క్యాపిటల్ ఐపీఓ ప్రారంభానికి ముందే, పబ్లిక్ ఆఫర్‌కు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ కనిపించింది. ఈ మేరకు యాంకర్ ఇన్వెస్ట్‌మెంట్ లాట్ విజయవంతంగా ముగిసింది.

ఈ సందర్భంగా, దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న 68 సంస్థాగత పెట్టుబడిదారులకు కంపెనీ రూ. 4,642 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. కేటాయించిన దానికంటే ఐదు రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్ రావడం విశేషం!

ముఖ్యంగా, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ...