భారతదేశం, ఏప్రిల్ 24 -- హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ గార్డియ‌న్ తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. గురువారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి గురు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గార్డియ‌న్ సినిమాను డైరెక్ట‌ర్ విజ‌య్‌చంద‌ర్ నిర్మించాడు. ఈ మూవీలో సురేష్ చంద్ర‌మీన‌న్‌, శ్రీమాన్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

త‌మిళంలో గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైన గార్డియ‌న్‌ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. కోటి లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. కాన్సెప్ట్‌, డైరెక్ట‌ర్ టేకింగ్‌, వీఎఫ్ఎక్స్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై హీరోయిన్ సాయంతో ఓ అమ్మాయి ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంది అనే ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. గార్డియ‌న్ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు.

అప...