భారతదేశం, జనవరి 26 -- బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో బిగ్​ ట్విస్ట్​! నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వేలిముద్ర నమూనాలు.. క్రైమ్​ సీన్​ నుంచి సేకరించిన ఫింగర్​ప్రింట్​ శాంపిల్స్​తో మ్యాచ్​ అవ్వడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నేరస్థుడిని వదిలేసి, ముంబై పోలీసులు మరొకరిని పట్టుకున్నారా? అని సందేహాలు వెలువడుతున్నాయి.

సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసు నిందితుడు ​ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ వేలిముద్ర నమూనాలపై రాష్ట్ర నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) నెగిటివ్ రిపోర్టులు సమర్పించిందని మిడ్ డే ప్రత్యేక నివేదిక పేర్కొంది. ఘటనాస్థలం నుంచి సేకరించిన మొత్తం 19 వేలిముద్రల సాంపిల్స్​ - నిందితుడి వేలిముద్రలతో సరిపోలడం లేదని వివరించింది.

షెహజాద్ పది వేళ్ల నుంచి ప్రింట్లను.. సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపించారు. 19 క్రైమ్ సీన్ ఫింగర్ ప్రింట...