భారతదేశం, జూలై 27 -- భారతీయుల కారు కొనే ట్రెండ్​ మారింది! బండి డిజైన్​, ఫీచర్స్​తో పాటు ఇప్పుడు సేఫ్టీకి సైతం అధిక ప్రాధాన్యతని ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ సేఫ్టీ కీలకం అని భావించి, ఒక కారు కొనే ముందు దాని సేఫ్టీ ఫీచర్స్​పై రీసెర్చ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆటోమొబైల్​ సంస్థలు తమ వాహనాలను కొత్త కొత్త సేఫ్టీ ఫీచర్స్​తో అప్​డేట్​ చేస్తున్నాయి. వీటిల్లో 6 ఎయిర్​బ్యాగ్​లు ముఖ్యంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో రూ. 10లక్షల బడ్జెట్​ ధరలోపు, 6 ఎయిర్​బ్యాగ్​లతో వస్తున్న పలు కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్ ఈవీ​- ఇండియాలో గతేడాది లాంచ్​ అయిన టాటా పంచ్​ ఈవీలో 6 ఎయిర్​బ్యాగ్​ల సెటప్​ ఉంది. బేస్​ వేరియంట్​కి కూడా 6 ఎయిర్​బ్యాగ్​లు లభిస్తుండటం విశేషం. అంతేకాదు భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ పంచ్​ ఈవీకి 5 స్టార్​ రేటింగ్​ లభ...