భారతదేశం, ఏప్రిల్ 17 -- సూత్ర‌వాక్యం అనే సినిమా సెట్స్‌లో తన సహ నటుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా లైంగికంగా వేధింపుల‌క‌కు గురిచేశాడంటూ మ‌ల‌యాళ న‌టి విన్సీ అలోషియ‌న్ మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్‌లో ఫిర్యాదు చేశారని సమాచారం. ఆమె ఆరోప‌ణ‌లు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారాయి. కేర‌ళ ఫిలిం ఛాంబ‌ర్‌లోనూ విన్సీ అలోషియ‌స్ ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

కేర‌ళ‌లో నిర్వ‌హించిన డ్ర‌గ్స్ అవేర్‌నెస్ క్యాంప్‌లో విన్సీ అలోషియ‌న్ పాల్గొన్న‌ది. ఈ సంద‌ర్భంగా సూత్ర‌వాక్యం సినిమా సెట్స్‌లో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని వివ‌రించింది. తాజాగా మ‌రోసారి ఈ ఆరోప‌ణ‌ల‌పై సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియోలో ఎక్క‌డ సహ నటుడి పేరును విన్సీ ఆలోషియ‌న్ వెల్ల‌డించ‌లేదు.

సూత్ర‌వాక్యం సినిమా సెట్స్‌లో ఓ స‌హ‌న‌టుడు త‌న దుస్తులు స‌ర్ధుతున్న‌ట్లుగా న‌టిస్...