Hyderabad, మే 29 -- ఆహా వీడియో ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ సెలబ్రిటీ గేమ్ షో సర్కార్ (Sarkaar). ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న షో ఇది. తొలి మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా ఉండగా.. గత సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఐదో సీజన్ రాబోతోంది. గురువారం (మే 29) ఈ కొత్త సీజన్ ప్రోమోను రిలీజ్ చేశారు.

సర్కార్ ఆహా వీడియో ఓటీటీ సూపర్ హిట్ గేమ్ షో. తెలుగులో వచ్చిన తొలి బిడ్డింగ్ గేమ్ షో ఇది. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఐదో సీజన్ తో రాబోతోంది. జూన్ 6న సాయంత్రం 7 గంటల నుంచి ఐదో సీజన్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో ఓటీటీ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ఇందులో సుధీర్ తనదైన స్టైల్లో సూపర్ ఎంట్రీ ఇచ్చాడు.

ఈసారి తెలంగాణ యాసలో ఏవో డైలాగ్స్ చెప్పడానికి ట...