భారతదేశం, ఏప్రిల్ 16 -- సీయూఈటీ పీజీ 2025 కి సంబంధించిన ప్రొవిజనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలోనే విడుదల చేయనుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్, ప్రశ్నపత్రాలు అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులోకి వస్తాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు exams.nta.ac.in/CUET-PG వద్ద చెక్ చేసుకోవచ్చు.

సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఫీజు చెల్లించి రిక్వెస్ట్​ పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఆన్సర్​ కీ విడుదల చేసిన తర్వాత వచ్చే నోటిఫికేషన్​లో చెబుతారు.

సవాళ్లకు సరైన ఆధారాలు లేకపోయినా, నిర్దేశిత లింక్ కాకుండా మరే ఇతర మాధ్యమం ద్వారా దాఖలు చేసినా సంబంధిత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోబోమని ఎన్టీఏ తెలిపింది. లేవనెత్తిన అభ్యంతరాలపై ఎన్టీఏ నిర్ణయమే అంతిమమని, తదుపరి కమ్యూనికేషన్​ని అనుమతించబోమని స్పష్టం చేస...