భారతదేశం, జూలై 27 -- సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​​ (సీబీఎస్‌ఈ) ఈ నెలలో నిర్వహించిన 10వ తరగతి, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత.. అభ్యర్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in లో తమ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు.

సీబీఎస్‌ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షను జులై 15, 2025న (ఒకే రోజు) నిర్వహించారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జులై 15న ప్రారంభమై జులై 22న ముగిశాయి. చాలా సబ్జెక్టులకు పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరిగాయి. కొన్ని ఇతర పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించారు. ఈ సప్లిమెంటరీ పరీక్షలను 2024-25 విద్యా సంవత్సరపు బోర్డు పరీక్షల సిలబస్ ఆధారంగా నిర్వహించారు.

స్టెప్​ 1- సీబీఎస్‌ఈ ఫలితాల వెబ్‌సైట్ cbseresults.nic.i...