భారతదేశం, జూన్ 28 -- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మే 2025లో నిర్వహించిన సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. ఫలితాలను విడుదల చేసే తేదీని ఐసీఏఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ జులై మొదటి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐసీఏఐ మాజీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ధీరజ్ ఖండేల్వాల్ తన ఎక్స్ అకౌంట్​ ద్వారా ఇచ్చిన సమాచారం ప్రకారం.. జులై మొదటి వారంలో, అంటే జులై 3 లేదా 4 తేదీల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫలితాలు విడుదలైన తర్వాత, పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.org లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలు చూసుకోవడానికి అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

సీఏ ఫైనల్​ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థుల...