భారతదేశం, మే 21 -- ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోడానికి మూడు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న ఐఏఎస్‌ అధికారి పాదాభివందనం చేయడం తెలంగాణ దుమారం రేపింది. నగర కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన ఇందిర సౌర గిరి జలవికాసం కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి శరత్‌ సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు మొక్కేందుకు ప్రయత్నించడం వివాదాస్పదం అయ్యింది.

సీఎం కాళ్లకు మొక్కేందుకు ఐఏఎస్ అధికారి ప్రయత్నించిన వ్యవహారంపై తెలంగాణ సీఎస్‌ రామకృష్ణరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలిండియా సర్వీస్‌ అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తర్వులు జారీ చేశారు.

కొందరు ఏఐఎస్ అధికారులు తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించక పోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, బహిరంగ సమావేశాల్లో అనుచిత ప్రవర్తన తగదని సీఎస్‌ హెచ్చరించారు.

ప్రజలను కలిసే సమయాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల...