భారతదేశం, ఏప్రిల్ 30 -- గూగుల్ మాతృసంస్థ 2024లో తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వ్యక్తిగత భద్రత కోసం 8 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.68 కోట్లు) ఖర్చు చేసిందని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు సమర్పించిన ప్రాక్సీ ఫైలింగ్ లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది.

యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు సమర్పించిన ప్రాక్సీ ఫైలింగ్ లోని వివరాల ప్రకారం.. సుందర్ పిచాయ్ భద్రతా ఖర్చుల కోసం 2024 లో అల్ఫాబెట్ సుమారు 8.27 మిలియన్ డాలర్లు (సుమారు రూ.67.8 కోట్లు) కేటాయించింది. 2023 లో సీఈఓ సుందర్ పిచాయ్ భద్రత కోసం కేటాయించిన మొత్తం 6.78 మిలియన్ డాలర్ల (రూ.57.48 కోట్లు) కంటే 22 శాతం ఎక్కువ. రెసిడెన్షియల్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ కన్సల్టేషన్స్, మానిటరింగ్ సర్వీసెస్, డ్రైవింగ్ ట్రాన్స్పోర్టేషన్, సమగ్ర ప్...