Hyderabad, ఆగస్టు 28 -- సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్.. ఇలా దేనికైనా సరే మంచి కథలు అందించే సామర్థ్యం మీకుంటే జీ తెలుగు రైటర్స్ రూమ్ మీకోసం ఓ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. జీ నెట్‌వర్క్ లోని అన్ని ప్లాట్‌ఫామ్స్ కోసం స్టోరీలను రాసే అవకాశం మీకు దక్కవచ్చు. దీనికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

జీ నెట్‌వర్క్ లో జీ తెలుగు ఛానెల్ తోపాటు జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో సీరియల్స్ తోపాటు ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా వస్తుంటాయి. వీటికోసం క్రియేటివ్ స్టోరీ రైటర్స్ ను ఆ ఛానెల్ ఆహ్వానిస్తోంది. ఎంపికైన రచయితలకు విస్తృతమైన 'Z' సంస్థలోని టీవీ, డిజిటల్, సినిమా ప్లాట్‌ఫామ్‌ల కోసం సమర్థవంతమైన, ఆకర్షణీయమైన కథలను రూపొందించే అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న జీ రైటర్స్​ రూమ్​ కార్యక్రమంలో భాగంగా జీ తెలుగు శనివా...