భారతదేశం, జూన్ 28 -- షియోమీ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ, చైనాలో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీని విడుదల చేసింది. దాని పేరు Xiaomi YU7. ప్రారంభ ఎక్స్​షోరూం ధర 253,000 యువాన్​లు (సుమారు రూ. 30.26 లక్షలు). తమ మొదటి ఈవీ, ఎస్​యూ7 సెడాన్ విజయవంతం అయిన తర్వాత, ఆటోమోటివ్ రంగంలో షియోమీ చేపట్టిన రెండో ప్రయత్నం ఈ వైయూ7. ఇది అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన పర్ఫార్మెన్స్​, కస్టమైజేషన్ ఆప్షన్స్​తో వస్తుంది. హైలైట్​ విషయం ఏంటంటే.. బుకింగ్స్​ ఓపెన చేసి వెంటనే ఈ ఎలక్ట్రిక్​ కారుకు విపరీతమైన డిమాండ్​ కనిపించింది.

మార్కెట్ నుంచి బలమైన డిమాండ్‌ను చూపిస్తూ, లాంచ్ అయిన మొదటి 18 గంటల్లోనే వైయూ7కి 240,000కు పైగా ప్రీ-ఆర్డర్‌లు వచ్చాయని షియోమీ ధృవీకరించింది. ఇది చైనా ఈవీ విభాగంలో షియోమీ బ్రాండ్ పెరుగుతున్న ఉనికిని బలపరుస్తుంది. వైయూ7 ధర పరంగా ...