భారతదేశం, జూన్ 24 -- భారత ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్​కి అత్యధిక వాటా ఉంది. నెక్సాన్​ ఈవీ, పంచ్​ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్​ ఈవీ వంటి బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​కి మంచి డిమాండ్​ ఉంది. ఇక టాటా మోటార్స్​ నుంచి ఇటీవలే టాటా హారియర్​ ఈవీ మార్కెట్​లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు, ఈ ఎలక్ట్రిక్​ కారుకు సంబంధించిన ధరల వివరాలను సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఒకవేళ మీరు ఈ ఎలక్ట్రిక్​ కారు కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. హైదరాబాద్​లో టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అంటే హైదరాబాద్​లో టాటా హారియర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 22.58 లక్షల నుంచి రూ. 29.08 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ వీటిపై ఏమైనా ఆఫర్లు ఉంటే, ధరలు తగ్గొచ్చు.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ...