భారతదేశం, జూలై 15 -- ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా.. ఎట్టకేలకు ఇండియాలోకి అడుగుపెట్టింది. అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కి చెందిన ఈ టెస్లా, తన అత్యధికంగా అమ్ముడైన మోడల్ వై ఎస్​యూవీని దేశంలోకి రూ. 59.89 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. అంతేకాదు, బ్రాండ్ మొదటి డీలర్‌షిప్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లో ప్రారంభమైంది. టెస్లా మోడల్ వై ఆర్​డబ్ల్యూడీ, లాంగ్ రేంజ్ ఆర్​డబ్ల్యూడీ వేరియంట్‌లలో లభిస్తుంది. టాప్-స్పెక్ లాంగ్-రేంజ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై) గా నిర్ణయించడం జరిగింది.

అయితే ఈ ధరలకు ఫుల్​ సెల్ఫ్​ డ్రైవింగ్​ కెపాసిటీ టెస్లా కార్లు ఇవ్వడం లేదు. ఇందుకోసం రూ. 6లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్లకు డ్రైవర్ చురుకైన పర్యవేక్షణ అవసరమని క...