భారతదేశం, జూలై 14 -- కియా మోటార్స్​ నుంచి ఒక కొత్త ఎలక్ట్రిక్​ కారు రేపు, జులై 15న భారత మార్కెట్​లో లాంచ్​ కానుంది. దాని పేరు కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీ. ఇదొక లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ కారు. ఇది భారతదేశంలో కియా విస్తరిస్తున్న ఈవీ లైనప్‌లో ఒక వ్యూహాత్మక అడుగు. ఈ రాబోయే మోడల్ తన విభాగంలో మొట్టమొదటి 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ కానుంది. విశాలమైన స్పేస్​, కంఫర్ట్​, ఎలక్ట్రిక్ సామర్థ్యంతో, క్యారెన్స్ క్లావిస్ ఈవీ నగరాల్లోని కుటుంబాలను ఆకట్టుకునే లక్ష్యంతో తయారైంది. ఇది అందించే సౌకర్యాలు, ఫీచర్ల గురించి ఇక్కడ వివరంగా చూద్దాం.

క్లావిస్ ఈవీ సాధారణ క్యారెన్స్ ఎంపీవీకి చెందిన మొత్తం సిల్హౌట్‌ను పోలి ఉంటుంది. అయితే.. ఇది దాని ఎలక్ట్రిక్ వర్షెన్​ కోసం కొన్ని సూక్ష్మ డిజైన్ మార్పులను పరిచయం చేస్తుంది. ముందు భాగంలో, ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉన్న క్ల...