భారతదేశం, ఆగస్టు 7 -- వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్​ఫాస్ట్.. భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడులోని తమ కొత్త ప్లాంట్‌లో ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించిన ఈ సంస్థ.. త్వరలో దేశీయ వినియోగదారుల కోసం రెండు ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను అందుబాటులోకి తీసుకురానుంది. అవి వీఎఫ్7, వీఎఫ్6. ఈ నేపథ్యంలో.. రెండు మోడళ్ల వేరియంట్లు, ఇంటీరియర్ థీమ్‌లు, ఎక్స్‌టీరియర్ రంగుల వివరాలను తాజాగా కంపెనీ వెల్లడించింది. పండుగ సీజన్‌లో లాంచ్ కానున్న ఈ కార్ల కోసం రూ. 21,000 చెల్లించి ప్రీ-బుక్​ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

విన్​ఫాస్ట్ వీఎఫ్7 ఎలక్ట్రిక్​ కారు భారత్‌లో సంస్థకు చెందిన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలవనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో రెండు వేరియంట్లు మాత్రమే ఉన్...