భారతదేశం, సెప్టెంబర్ 19 -- భారతదేశ మార్కెట్​లో తనదైన ముద్ర వేయాలని వియత్నాం ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ విన్​ఫాస్ట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వినఫాస్ట్ వీఎఫ్​6 మోడల్‌కు అగ్రెసివ్​ ధర నిర్ణయించి, అదనపు ఫీచర్లతో లాంచ్ చేసింది. సాధారణంగా ఈ ఫీచర్లు ఉన్నత శ్రేణి కార్లలో మాత్రమే కనిపిస్తాయి. జులై 2025లో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ బుకింగ్‌లు ప్రారంభం కాగా, ఇది ప్రధానంగా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎర్త్, విండ్. ఇందులో విండ్ వేరియంట్‌లో విండ్ ఇన్ఫినిటీ అనే అప్‌గ్రేడ్ కూడా ఉంది. ఈ వేరియంట్లు కొనుగోలుదారులకు చాలా ఆప్షన్స్​ ఇస్తున్నప్పటికీ, ఏది ఎంచుకోవాలనే గందరగోళాన్ని కూడా సృష్టిస్తున్నాయి. మీ అవసరాలకు ఏ వేరియంట్ సరిపోతుందో తెలుసుకోవడానికి, వాటి మధ్య తేడాలను వివరంగా విశ్లేషిద్దాం.

విన్​ఫాస్ట్ వీఎఫ్​6 ఒకే 59.6 కేడబ్ల్యూహెచ్​ బ్యాటర...