భారతదేశం, మే 18 -- జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత మార్కెట్​లో విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్​ కారు డెలివరీలను ప్రారంభించింది. ఇటీవల లాంచ్ అయిన ఈవీ కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్స్ సాధించడం విశేషం. ఇది విండ్సర్ లైనప్​లో కొత్త టాప్-ఎండ్ వేరియంట్​గా అందుబాటులోకి వచ్చింది. స్టాండర్డ్ విండ్సర్ ఈవీ కంటే అనేక కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్​ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్​ కారులో ఎక్స్​షోరూమ్ ధర రూ.18.10 లక్షలు. తొలుత రూ.17.49 లక్షల ఎక్స్​షోరూమ్ ధరతో లాంచ్ చేసినప్పటికీ తొలి 8,000 మంది కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి ఉంది.

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోలో 52.9 కిలోవాట్ల బ్యాటరీ ఉంది. స్టాండర్డ్​ విండ్సర్ ఈవీ 38 కిలోవాట్ల యూనిట్​తో అందుబాటులో ఉంది.

విండ్సర్ ఈవీ ప్రోని ఒక్కసారి ...