భారతదేశం, ఫిబ్రవరి 21 -- జెన్ 3 ప్లాట్​ఫామ్​తో కూడిన ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్​ ఇటీవలే మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డెలివరీలను త్వరలోనే ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది ఓలా ఎలక్ట్రిక్​. అంతేకాదు బెంగళూరులో ఈ ఈ-స్కూటర్ తాజాగా​ దర్శనమిచ్చింది. ఈ మోడల్​ అఫార్డిబుల్​ ధరలో మంచి పర్ఫార్మెన్స్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఈ ఎస్​1 ఎక్స్​ ప్లస్​.. ఎస్​1 ప్రో, ఎస్​1 ఎక్స్​ మధ్యలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో మాత్రమే లభిస్తుంది. మునుపటి తరం ఎస్1 ఎక్స్ ప్లస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉండేది.

జెన్3 ఎస్1 ఎక్స్ ప్లస్ పోర్టబుల్ 750 వాట్ ఛార్జర్​తో వస్తుంది. బ్యాటరీ పరిమాణం పెద్దదే ...