భారతదేశం, మే 27 -- ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ మ్యాటర్ తన ఎలక్ట్రిక్ బైక్​ మ్యాటర్ ఏరాకు లైఫ్​టైమ్​ బ్యాటరీ వారంటీని ప్రవేశపెట్టింది. భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఇలాంటి వారంటీని అందించడం ఇదే మొదటిసారి అని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు ఆందోళన కలిగించే బ్యాటరీ లైఫ్, బ్యాటరీ రీప్లేస్​మెంట్​ ఖర్చులను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది.

ఎలక్ట్రిక్ వాహనంలో అత్యంత ఖరీదైన కాంపోనెంట్ అయిన ఈ బ్యాటరీని సంస్థ జీవితాంతం కవర్ చేయనుంది. సాధారణంగా, ఈవీ బ్యాటరీలు మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు వారంటీలతో వస్తాయి. లైఫ్​టైమ్​ వారంటీ ఈ ప్రమాణాన్ని గణనీయంగా మారుస్తుంది.

ఈ మ్యాటర్​ ఏరా ఎలక్ట్రిక్​ బైక్​లో 5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే సుమారు 170 కి.మీ రేంజ్​ని ఇస్త...