భారతదేశం, ఏప్రిల్ 20 -- ఇండియన్​ 2 వీలర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​లో బెస్ట్​ సెల్లింగ్​గా కొనసాగుతోంది బజాజ్​ చేతక్​. గత ఆర్థిక ఏడాదిలో 2.6లక్షల చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు అమ్ముడుపోయాయి. కొత్త ఈ-స్కూటర్​ కొనాలనుకునే వారికి ఈ మోడల్​ మంచి ఆప్షన్​ అవుతోంది. ఈ నేపథ్యంలో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర, రేంజ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

బజాజ్​ చేతక్​ సక్సెస్​కి ఉన్న కారణాల్లో ఒకటి దాని డిజైన్​! రెట్రో ఫీల్​తో పాటు మాడర్న్​ లుక్​ని ఇచ్చే విధంగా ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డిజైన్​ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్​ బ్యాలెన్స్​ అని మార్కెట్​ నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఈ-స్కూటర్​కి ప్రీమియం ఫీల్​ని ఇచ్చే స్టైలిష్​ ఆప్షన్​గా పరిగణించవచ్చు.

పిస్తా గ్రీన్​, హెజిల్​నట్​, ఇండిగో మెటాలిక్​, బ్రూక్లిన్​ బ్లాక్​, మాట్​ స్కార్లెట్​ రెడ్​ వంటి ...