భారతదేశం, ఆగస్టు 10 -- ఇండియాలో 2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. కస్టమర్స్​కి అనేక ఆప్షన్స్​ లభిస్తున్నాయి. ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త ప్రాడక్ట్స్​ని సైతం లాంచ్​ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు, జెలో ఎలక్ట్రిక్​ సంస్థ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని తీసుకొచ్చింది. దాని పేరు జెలో నైట్​+. దేశంలోనే అత్యంత సరసమైన ఈవీ స్కూటర్లలో ఇది ఒకటి. దీని ఎక్స్​షోరూం ధర రూ. 59,990గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఈ-స్కూటర్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

జెలో నైట్​+ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నిత్యం ప్రయాణించేవారి అవసరాలను తీర్చే విధంగా దీనిని రూపొందించారు. ఈ స్కూటర్‌లో 1.8 కేడబ్ల్యూహెచ్​ సామర్థ్యం గల పోర్టబుల్ ఎల్​ఎఫ్​పీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 100 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీని...