భారతదేశం, జూన్ 13 -- రెగ్యులర్​ స్మార్ట్​ఫోన్​లు వాడి, వాడి బోర్​ కొట్టేసిందా? ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీరు ఫ్లిప్-స్టైల్ ఫోన్స్​ని ట్రై చేయొచ్చు. కానీ వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే! భారతదేశంలో, శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 6, మోటోరోలా రేజర్​ 60 అల్ట్రా వంటి ఫ్లాగ్‌షిప్ ఫోల్డెబుల్​ ఫోన్‌ల కంటే కొన్ని గ్యాడ్జెట్స్​ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరసమైన ధరకు అందుబాటులో ఉన్న టాప్​ 4 ఫ్లిప్ ఫోన్‌ల జాబితాను ఇక్కడ తెలుసుకోండి..

1. మోటోరోలా రేజర్​ 50:

ఈ ఫ్లిప్​ ఫోన్​ గత సంవత్సరం వచ్చిన రేజర్​ 50 అల్ట్రా మోడల్‌కు సరసమైన ప్రత్యామ్నాయం! ఈ ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్​తో వస్తుంది. ఇది శక్తివంతమైన పనితీరును, రోజు...