భారతదేశం, జనవరి 31 -- బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన రూ. 9 కోట్ల పరువు నష్టం దావాలో ముంబై కోర్టు కీలక తీర్పునిచ్చింది. సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా దర్శకుడు అభినవ్ కశ్యప్‌ను కోర్టు తాత్కాలికంగా అడ్డుకుంది. ఈ మేరకు జడ్జి పి.జి. భోస్లే శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

సల్మాన్ ఖాన్ రూ. 9 కోట్ల పరువు నష్టం దావా కేసులో డైరెక్టర్ అభినవ్ కశ్యప్‌కు ముంబై కోర్ట్ షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

"భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే, ఆ హక్కు పేరుతో ఒక వ్యక్తిపై లేదా వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దూషించడం లేదా బెదిరించడం సరైంది కాదు. ప్రతి వ్యక్తికి తన గౌరవాన్ని, గోప్యతను కాపాడుకునే హక్కు ఉంటుంది" అని కోర్టు స...