Hyderabad, ఆగస్టు 19 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ నటించిన హరి హర వీరమల్లు మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ వారం చివర్లో లేదంటే వచ్చే వారం ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఉంటుందని భావించినా.. బుధవారం (ఆగస్టు 20) నుంచే మూవీ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇది ఒకరకంగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

హరి హర వీరమల్లు మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అభిమానులకు సడెన్ షాకిస్తూ ఈ సినిమాను బుధవారం (ఆగస్టు 20) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ విషయాన్ని మూవీలోని ఫిమేల్ లీడ్ నిధి అగర్వాల్ తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"థియేటర్లలో మీరు కురిపించిన ప్రేమ, అభిమానం తర్వాత ఇప్పుడు ఈ ఎపిక్ సాగా హరి హర వీరమల్లు ఓటీటీ స్క్రీన్లను ఏలడానికి సిద్ధమైంది. ప్రైమ్ వీడియోలో చూడండి" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. ద...