భారతదేశం, ఆగస్టు 31 -- ఈకో ఫ్రెండ్లీతో పాటు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చే ఈవీ కంపెనీల్లో ఏథర్​ ఒకటి. తాజాగా జరిగిన 'ఏథర్ కమ్యూనిటీ డే 2025'లో ఏథర్ 450 అపెక్స్‌ను మరిన్ని అప్‌డేట్ ఫీచర్లతో సంస్థ లాంచ్ చేసింది. ఈ అప్‌డేట్స్‌తో స్కూటర్ మరింత స్మార్ట్​గా, అలాగే ఆచరణాత్మకంగా మారింది. కొత్తగా ఇందులో ఇన్‌ఫినిట్ క్రూయిజ్ సిస్టమ్, ఏథర్ స్టాక్ 7 సాఫ్ట్‌వేర్‌ను జోడించారు. ఈ రెండూ కలిసి రోజువారీ ప్రయాణాల్లో ఎదురయ్యే అనేక ఇబ్బందులను తగ్గిస్తాయి.

అపెక్స్ స్కూటర్‌లో అతిపెద్ద మార్పు ఇన్‌ఫినిట్ క్రూయిజ్ సిస్టమ్. సాధారణ క్రూయిజ్ కంట్రోల్ కేవలం వేగాన్ని స్థిరంగా ఉంచితే, ఏథర్ సిస్టమ్ రియల్​ టైమ్​ పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తుంది.

సిటీ మోడ్: ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ప్రయాణించేటప్పుడు ఈ సిస్టమ్ స్కూటర్‌ను స్థిరమైన వేగంతో కదిలేలా చేస్తుంది. దీనివల్ల ...