భారతదేశం, ఏప్రిల్ 17 -- సెకెండ్​ జనరేషన్​ స్కోడా కొడియాక్​ ఎస్​యూవీ ఇండియాలో తాజాగా లాంచ్​ అయ్యింది. ఈ ఫ్లాగ్​షిప్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 46.89 వద్ద ప్రారంభమవుతుంది. దిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో 2025లో తొలిసారి ప్రదర్శించిన ఈ స్కోడా కొడియాక్​ని భారత్​లోనే అసెంబుల్ చేయనున్నారు. కొత్తగా లాంచ్ అయిన ఎస్​యూవీని స్పోర్ట్​లైన్, లారిన్ అండ్​ క్లెమెంట్ అనే రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. లారిన్ అండ్ క్లెమెంట్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.48.69 లక్షలు.

సరికొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లు, పనితీరుతో 2025 స్కోడా కొడియాక్ భారతదేశ ప్రీమియం ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఉన్న పోటీని మరింత పెంచనుంది. టయోటా ఫార్చ్యూనర్, వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్, జీప్ మెరిడియన్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ వివరాలను ఇక్కడ ...