భారతదేశం, మే 13 -- టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ మే 22న లాంచ్​కు రెడీ అవుతోంది. కాగా ఈ మోడల్​ని టాటా మోటార్స్​ తాజాగా ఆవిష్కరించింది. 2020లో లాంచ్​ అయినప్పటి నుంచి ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ అందుకున్న తొలి ఫేస్​లిఫ్ట్​ ఇదే కావడంతో లేటెస్ట్​ మోడల్​పై భారీ అంచనాలే ఉన్నాయి. కొత్త ఆల్ట్రోజ్ ప్యూర్, క్రియేటివ్, అచీవ్డ్ ఎస్, ఎక్వైర్డ్ + ఎస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​పై పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ గణనీయంగా అప్డేటెడ్​ డిజైన్ లాంగ్వేజ్​తో వస్తుంది. ముందు భాగంలో డబుల్ బ్యారెల్ ఎల్ఈడీ లైట్లతో పాటు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ట్విన్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇది విస్తృతమైన ఎయిర్ ఇన్​టేక్​తో రీవ్యాంప్డ్​ ఫ్రెంట్ బంపర్​ను కూడా ...