భారతదేశం, మే 19 -- స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మించిన తొలి చిత్రం 'శుభం' ఈనెల మే 9వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ తెలుగు హారర్ కామెడీ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రీయా కొంతం లీడ్ రోల్స్ చేశారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్‍లో సక్సెస్ దక్కలేదు. అయితే శుభం చిత్రానికి ఇప్పుడు ఓటీటీ ఎదురుదెబ్బ ఎదురైందని తెలుస్తోంది.

శుభం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. క్రేజ్ ఉండడంతో మంచి ధరకు దక్కించుకుందని తెలిసింది. అయితే, ఇప్పుడు ఆ ఓటీటీ సంస్థ ట్విస్ట్ ఇచ్చిందట. ఓ డీల్ క్యాన్సిల్ చేసేందుకు జీ5 నిర్ణయించుకుందని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. శుభం మూవీ హక్కుల ఒప్పందం నుంచి వైదొలిగేందుకు జీ5 సిద్ధమైందని ...