భారతదేశం, అక్టోబర్ 27 -- సమంత రూత్ ప్రభు రెండేళ్ల తర్వాత మరోసారి ఓ పూర్తి స్థాయి తెలుగు సినిమా చేస్తోంది. ఈ మూవీ పేరు మా ఇంటి బంగారం. ఈ మూవీ షూటింగ్ సోమవారం (అక్టోబర్ 27) ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో డైరెక్టర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ గా భావిస్తున్న రాజ్ నిడిమోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

సమంత నటించిన ఖుషీ మూవీ 2023లో రిలీజైంది. ఆ తర్వాత మధ్య తానే నిర్మించిన శుభం సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన ఆమె.. రెండేళ్ల తర్వాత మా ఇంటి బంగారం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తిరిగొస్తోంది. ఈ సినిమాను కూడా సమంతకే చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మిస్తుండటం విశేషం.

ఈ సినిమా షూటింగ్ సోమవారం (అక్టోబర్ 27) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. "అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో మా ఇంటి బంగారం ముహూర్త...