భారతదేశం, జనవరి 30 -- ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన 'కెన్నెడీ' (Kennedy) సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు గుడ్ న్యూస్. 2023లో పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించినా థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకే వస్తుండటం విశేషం.

బాలీవుడ్ లో విలక్షణమైన మూవీస్ ఎన్నో డైరెక్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ కెన్నెడీ రూపంలో అలాంటిదే మరో మూవీని ప్రేక్షకులకు అందించాడు. ఈమధ్యే ముంబై వదిలేసి సౌత్ సినిమాల్లో నటుడిగా అవకాశాలు వెతుక్కుంటున్న అనురాగ్ క్రియేట్ చేసిన మరో క్రైమ్ వరల్డ్ ఈ కెన్నెడీ. ఈ సినిమా జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సన్నీ లియోనీ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.

కెన్నెడీ మూవీ ఒక నియో-నాయిర్ (Neo-noir) క్రైమ్ థ్రిల్లర్. ఉదయ్ శెట్టి (రాహుల్ భట్) అనే మాజీ పోలీస్ ఆఫీస...