Hyderabad, మే 23 -- ఈ వారం మరో కన్నడ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గత నెల 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న ఈ సినిమాను ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూతురు నివేదిత శివరాజ్ కుమార్ నిర్మించడం విశేషం.

కన్నడ డ్రామా మూవీ పేరు ఫైర్‌ఫ్లై (Firefly). ఈ సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అతడే లీడ్ రోల్లోనూ నటించాడు. ఇక శివరాజ్ కుమార్ కూతురు నివేదిత శివరాజ్ కుమార్ నిర్మించింది. ఆమెకు నిర్మాతగా ఇదే తొలి సినిమా. ఈ ఫైర్‌ఫ్లై మూవీ శుక్రవారం (మే 23) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సడెన్ గా ఓటీటీలోకి వచ్చేయడం విశేషం.

ఫైర్‌ఫ్లై మూవీలో వంశీ కృ...