Hyderabad, మే 8 -- క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురుగా ప్రపంచానికి పరిచయమైన సారా టెండూల్కర్ ఆ తర్వాత తన అందంతో అభిమానులను ఆకర్షించింది. మోడలింగ్ వైపు రావడంతో ఆమె తర్వాత సినిమాల్లోనూ అడుగుపెడుతోందన్న వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా సారా స్పందించింది. తనకు అసలు యాక్టింగ్ అంటేనే పడదని స్పష్టం చేసింది.

సారా టెండూల్కర్ వోగ్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇందులో తన చిన్నతనం, బయోమెడికల్ సైన్సెస్ పై తనకున్న ఆసక్తి, నటనలాంటి వాటిపై స్పందించింది. బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నావా అని అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది.

"నేను ఒకటికి మించి పనులు చేస్తుంటాను. ఫౌండేషన్ పైనే ప్రస్తుతం నా దృష్టంతా. కానీ నేను ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ రంగాల్లోనూ క్రియేటర్ గా పని చేస్తాను. నాకు ఏది సరైనదనిపిస్తే అది చేస్తాను. నేను ప్రతిదానికీ సరే అని అనను. నటనలో నాకు...