భారతదేశం, ఫిబ్రవరి 5 -- ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి సైలెంట్ గా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మూవీ నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ కు చాలా కాలం తర్వాత దక్కిన హిట్ ఇది. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడమే కాదు.. 20 రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టి అక్కడా దూసుకుపోతోంది.

సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైంది నారీ నారీ నడుమ మురారి. అయితే బాక్సాఫీస్ హిట్ గా నిలిచినా మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. బుధవారం అంటే ఫిబ్రవరి 4 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

రెండో రోజే ప్రైమ్ వీడియో ఇండియాలో నంబర్ 1 ట్రెండింగ్ మూవీగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఓటీటీలో ఎగబడి చూస్తున్నారు. ఇందులోని కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని ...