భారతదేశం, మే 17 -- దేశంలో బంగారం ధరలు మే 17, శనివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 1220 పెరిగి.. రూ. 95,313కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 9,53,130కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 9,531గా కొనసాగుతోంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 1120 వృద్ధి చెంది.. రూ. 87,383కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 8,73,830గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,235గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,165గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,383 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,313గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,231...