భారతదేశం, ఏప్రిల్ 21 -- శ్రీమహావిష్ణువు కూర్మావతరంలో భక్తులకు దర్శనమిచ్చే శ్రీకూర్మం క్షేత్రంలో తాబేళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందడం వెలుగు చూసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో ఉన్న శ్రీకూర్మం క్షేత్రానికి చారిత్రక నేపథ్యం ఉంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో తాబేళ్లు సంచరిస్తుంటాయి. కూర్మావతరంలో శ్రీ మహావిష్ణువు కొలువుదీరాడని భక్తులు విశ్వసిస్తారు. వాటిని భక్తితో పూజిస్తారు. ఈ క్రమంలో ఇటీవల పెద్ద సంఖ్యలో తాబేళ్లు మృతి చెందడం వెలుగు చూసింది.

శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్న శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు పెద్ద సంఖ్యలో మరణించడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజుల్లో పదుల సంఖ్యలో తాడేళ్లు మృతి చెందాయి.

ఆలయ అధికారులు, తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు గుట్టుగా దహనం చేశారు. ఆ...