భారతదేశం, ఫిబ్రవరి 5 -- శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడి అనుగ్రహం ఉంటే విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. క్రూరగ్రహమైన రాహువుతో శుక్రుడు సంయోగం చెందబోతున్నాడు. శుక్రుడు, రాహువు కలయిక కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారికి కాసుల వర్షంతో పాటు అనేక విధాలైన లాభాలు కలుగుతాయి.

ఫిబ్రవరి 6, 2026 అనగా రేపు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే రాహువు ఆ రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం, సంబంధాల్లో కూడా మార్పులు వస్తాయి.

12 రాశుల వారిపై ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత శుక్రుడు మార్చి 2న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటివరకు కూడా ఈ రెండు గ్రహాల కలయిక ఉంటుంది. ...