భారతదేశం, ఫిబ్రవరి 3 -- శివుడుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, శివుని అనుగ్రహం ఉంటే కష్టాలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. అయితే త్వరలోనే శివరాత్రి రాబోతోంది. శివరాత్రి నాడు శివుడిని ఆరాధించి అభిషేకం చేయడం, బిల్వపత్రాలను సమర్పించడం, శివరాత్రి నాడు జాగారం చేయడం వంటి రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. వీటిని పాటించడం వలన మహా శివుని ప్రత్యేక ఆశీస్సులు కలుగుతాయని నమ్ముతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారంటే శివుడికి ఎంతో ఇష్టం. ఎల్లప్పుడూ ఈ రాశుల వారికి శివుని అనుగ్రహం ఉంటుంది. దాంతో ఎంతటి కష్టాన్నైనా సులువుగా దాటేస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎల్లప్పుడూ శివుని అనుగ్రహం ఉంటుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. శివుడ...