భారతదేశం, జూలై 22 -- శాంసంగ్​ తన లేటెస్ట్​ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ స్మార్ట్‌వాచ్‌లను జులై 9న భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ వేరబుల్స్ ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్‌లకు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.32,999 నుంచి ప్రారంభమవుతాయి.

గెలాక్సీ వాచ్ 8:

ఈ స్మార్ట్‌వాచ్ 40ఎంఎం, 44ఎంఎం అనే రెండు కేస్ సైజులలో లభిస్తుంది.

40ఎంఎం బ్లూటూత్ మోడల్ ధర రూ. 32,999 కాగా, ఎల్​టీఈ మోడల్ ధర రూ. 36,999.

44ఎంఎం వేరియంట్ బ్లూటూత్ మోడల్ ధర రూ. 35,999, ఎల్​టీఈ మోడల్ ధర రూ. 39,999.

గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్:

ఈ మోడల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌తో కేవలం 46ఎంఎం డయల్ సైజులో మాత్రమే వస్తుంది.

బ్లూటూత్ మోడల్ ధర రూ. 46,999 కాగా, ఎల్​టీఈ వేరియంట్ ...