Hyderabad, మే 9 -- ఈ వీకెండ్ ఓ మాంచి హారర్ థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఓ మలయాళం మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పేరు వడక్కన్ (Vadakkan). రెండు నెలల కిందట అంటే మార్చి 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయింది. అంతేకాదు ఓటీటీలోకి అడుగుపెట్టిన తొలి రోజే టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లోకి వచ్చేసింది.

మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ వడక్కన్ శుక్రవారం (మే 9) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కిశోర్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. కేవలం గంటా 50 నిమిషాల నిడివితోనే వచ్చింది.

మార్చి 7న థియేటర్లలో రిలీజ్ కాగా.. అక్కడ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఓటీటీలోనూ తొలి రోజు నుంచే సత్తా చాటుతోంది. ప్రైమ్ వీడియో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ జాబితాలో 10వ స్థానంలో నిలవడం విశేషం.

వడక...