భారతదేశం, ఫిబ్రవరి 6 -- గత కొన్ని నెలలుగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన వెండి, ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2026 ఆరంభంలో అంచనాలకు మించి రాణించిన ఈ శ్వేత లోహం, ప్రస్తుతం విక్రయాల వెల్లువతో బేజారవుతోంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పడిపోయి, ఈ ఏడాది వచ్చిన లాభాలన్నింటినీ తుడిచిపెట్టేశాయి.
జనవరి 2026 వరకు వెండి ధరలు కిలోకు Rs.4.20 లక్షల పైన పలికి సరికొత్త రికార్డులు సృష్టించాయి. అటు పారిశ్రామికంగా, ఇటు సురక్షిత పెట్టుబడిగా వెండికి ఉన్న ఆదరణే దీనికి కారణం. అయితే, తాజా పతనంతో మార్చి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర ఒకే రోజు Rs.14,628 తగ్గి Rs.2,29,187 కనిష్ట స్థాయికి చేరుకుంది.
కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే వెండి ఏకంగా 45.6% పతనం కావడం గమనార్హం. ఇదే సమయంలో బంగారం ధరలు తమ గరిష్ట స్థాయి నుంచి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.