భారతదేశం, ఆగస్టు 14 -- దిల్లీ- ఎన్​సీఆర్​ ప్రాంతాల్లోని వీధి కుక్కులను షెల్టర్లకు తరలించాలన్న ఆగస్ట్​ 11 నాటి తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అనంతరం తీర్పును రిజర్వులో పెట్టింది. అయితే, రిజర్వులో పెట్టిన తీర్పును ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు! అదే సమయంలో, వీధి కుక్కల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను అమలు చేయడంలో దిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ అధికారుల వైఫల్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

"మీరు చట్టాలు, నిబంధనలు రూపొందిస్తారు. కానీ వాటిని అమలు చేయరు. ఒకవైపు మనుషులు బాధపడుతున్నారు, మరోవైపు జంతు ప్రేమికులు నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. జంతు సంక్షేమ బోర్డులు, అధికారులు ఏమీ చేయటం లేదు. వారే తమ నిబంధనలను అమలు చేయాలి, కానీ వారు ఏమీ...