భారతదేశం, ఆగస్టు 3 -- వివో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. రేపు, ఆగస్ట్​ 4న ఇండియాలో లాంచ్​కానుంది. దాని పేరు వివో వై400. ఇదొక 5జీ, మిడ్​ రేంజ్​ గ్యాడ్జెట్​. గత నెలలో వై400 ప్రోను విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ మొబైల్​ని మార్కెట్లోకి తీసుకొస్తోంది వివో సంస్థ. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో ధృవీకరించిన వివరాల ప్రకారం.. వై400 5జీ స్మార్ట్​ఫోన్​ భారతదేశంలో గ్లామ్ వైట్, ఆలివ్ గ్రీన్ అనే రెండు రంగుల్లో విడుదల కానుంది. వివో విడుదల చేసిన టీజర్ చిత్రాలు వై400 ప్రో వలె కర్వ్​డ్​ రేర్​, నిలువు కెమెరా అమరిక- డ్యూయల్ కెమెరా సెటప్‌ను సూచిస్తున్నాయి.

విడుదలకు ముందు, టిప్‌స్టర్ సుధాంశు అంబోర్ ఈ స్మార్ట్​ఫోన్​ గురించిన వివరాలను పంచుకున్నారు. లీక్ నమ్మదగినది అయితే.. వీవో వై400 5జీ 6.67-ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్‌ప్లేను 2400 x 10...