భారతదేశం, మే 11 -- గ్రీస్​లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది! కాఫీ కప్పు ఫొటోలు చూసి 'నీ భర్తకు వివాహేతర సంబంధం ఉంది' అని చాట్​జీపీటీ చెప్పడంతో సదరు మహిళ, తన భర్తకు విడాకులు ఇస్తోంది!

పురాతన కాలంలో టాస్సియోగ్రఫీ అనే పద్ధతితో భవిష్యత్తును ప్రెడిక్ట్​ చేసేవారు. టీ ఆకుల పాటర్న్​, తాగేసిన కాఫీ లేదా వైన్​ కప్పుల్లో కనిపించే చిహ్నాల ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగొచ్చు అనేది చెప్పేవారు.

ఇక ఇప్పుడు గ్రీస్​కి చెందిన ఒక మహిళ.. చాట్​జీపీటీలో ఈ టాస్సియోగ్రఫీని ప్రయత్నించింది. చాట్​జీపీటీలో రెండు కాఫీ కప్పుల ఫొటోలను అప్లోడ్​ చేసింది. 'నా భర్త కాఫీ కప్పును చూసి, అతనికి ఏదైనా అఫైర్​ ఉందా?' అని చెప్పమంది.

ఆ కాఫీ కప్పు చూసిన చాట్​జీపీటీ.. 'ఓ మహిళతో నీ భర్తకు వివాహేతర సంబంధం ఉంది. ఆమె వల్ల నీ కుటుంబం చీలిపోతుంది,' అని బదులిచ్చిందట. ...